Monday, December 23, 2024

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం: హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన చంద్రయాన్-3 మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 మొదటి దశ విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సిఎం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News