Monday, December 23, 2024

చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్ 3

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 3 లో కీలకమైన కక్ష కుదింపు చర్య ఆదివారం విజయవంతంగా పూర్తయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి వ్యోమనౌక లోని ఇంజిన్‌ను మండించి, దీని కక్షను మరింత తగ్గించ గలిగారు. ఫలితంగా ఇది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. ఇలాంటి విన్యాసాన్ని ఈనెల 9న మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల మధ్యకాలంలో నిర్వహిస్తారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతారు. చంద్రుడి కక్ష లోకి చేరుకున్న వ్యోమనౌక ఎత్తును దశల వారీగా తగ్గించి చివరకు దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిమీ వృత్తాకార కక్ష లోకి ప్రవేశ పెడతారు.

100 కిమీ కక్ష నుంచి తగ్గింపు చాలా క్లిష్టమైన దశ : ఇస్రో ఛైర్మన్
చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 3 ప్రస్తుతం సజావుగానే పనిచేస్తోందని, 100 కిమీ వృత్తాకార కక్ష నుంచి చంద్రునికి చేరువ కాడానికి బయలుదేరినప్పుడు కక్ష నిర్ధారణ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ సోమవారం వెల్లడించారు. జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 ఇంతవరకు మూడు దశలు పూర్తి చేసుకుని దాదాపు 4313 కిమీ ప్రయాణించి, చంద్రునికి చేరువగా 170 కిమీ పరిధిలో ఉందని చెప్పారు. ఈనెల 9 17 మధ్య అనేక ప్రక్రియలు పూర్తి చేసుకుని 100 కిమీ కక్ష లోకి చేరుతుంది. ఈ వ్యోమనౌక కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైకి కాలుమోపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. “వంద కిమీ వరకు తమకు ఎలాంటి కష్టం కనిపించలేదు. భూమిపై నుంచి ల్యాండర్‌ను కచ్చితంగా అంచనా వేయడమే క్లిష్టమైనది. ఈ లెక్కింపు చాలా క్లిష్టమైనది. ఇదే సరిగ్గా జరిగితే మిగతాదంతా సజావుగా సాగిపోతుంది ” అని సోమనాథ్ పేర్కొన్నారు.

ఈసారి కచ్చితంగా దీన్ని తాము కిందకు దించగలం. కక్ష మార్పిడి అనుకున్న ప్లాను ప్రకారం జరుగుతోంది. ఇందులో ఎలాంటి పొరపాటు లేదు. అందువల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అంతా సజావుగానే సాగుతుందని ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. “2019 చంద్రయాన్ 2 మిషన్ అనుభవం పాక్షిక విజయం. దీని వల్ల ఎంతో ఉపయోగం కలుగుతోందని నిరూపణ అవుతోంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోగలిగాం. దాన్ని బట్టి చంద్రయాన్ 3లో అనేక మార్పులు చేయగలిగాం. ” అని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్ 2 మిషన్ నుంచి వెలువడిన చంద్రుని చిత్రాలు చంద్రయాన్ 3 మెరుగైన స్థానం పొందడానికి, చంద్రునిపై ల్యాండింగ్ ప్రాంతాన్ని పెంచుకోడానికి ఉపయోగపడినట్టు వివరించారు. ఆకస్మిక పరిస్థితులను వైఫల్యాలను ఎదుర్కోడానికి తాము చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించామని చెప్పారు. ఈమేరకు చాలా సమగ్రంగా పరీక్షలు నిర్వహించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News