Monday, December 23, 2024

‘నేను చంద్రుడి మాయలో పడ్డాను’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపై కీలక పరిశోధనలకు ఉద్ధేశించిన చంద్రయాన్ 3లో అత్యంత కీలకమైన మరో ఘట్టం శనివారం విజయవంతం అయింది. ఇప్పటికే భూమి నుంచి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం దాటుకుని చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 వాహకనౌక ఇప్పుడు చంద్రుడి చుట్టూ చక్కర్ల దశకు చేరుకుంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించిన ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం అయింది. ఇస్రోకు చెందిన టెలీమెట్రి ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్) నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.

ఈ ప్రక్రియకు బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలూలోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడిఎస్‌ఎన్) ఆంటెన్నాల నుంచి సరైన మద్దతు దక్కింది. భూమి నుంచి చంద్రుడికి మొత్తం దూరంలో ఇప్పుడు చంద్రయాన్ ప్రయాణం మూడింట రెండొంతులు ముగిసింది. ఇప్పుడు చంద్రుడి కక్షలో ముందుకు సాగి , చంద్రుడి చుట్టూ తిరిగేందుకు శనివారం అత్యంత కీలకమైన లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ (ఎల్‌ఒఐ)ను దాదాపు ఏడు గంటల ప్రాంతంలో నిర్వహించారు. చంద్రయాన్ 3 ఇప్పుడు పూర్తిగా చంద్రుడి గురుత్వాకర్షక శక్తికి లోనయిందని మాక్స్ ఇస్ట్రాక్ ట్వీటు వెలువరించింది. సంబంధిత రిట్రో బర్నింగ్‌ను పెరిలూన్‌లో పూర్తిచేశారు. ఇప్పుడు చంద్రయాన్ నౌక చంద్రుడికి అత్యంత సమీప ప్రాంతాన్ని పెరిటూన్‌గా పిలుస్తారు.

ఈ ప్రాంతానికి చంద్రయాన్ చేరుకోగానే సంబంధిత జ్వలిత ప్రక్రియ విజయవంతం అయింది. ఇక దాదాపు 24 గంటలు చంద్రుడి చుట్టూ పరిభ్రమించిన తరువాత చంద్రయాన్ కక్షను తగ్గించే మరో కీలక ఘట్టాన్ని ఆగస్టు 6 , ఆదివారం (నేడు) మధ్యాహ్నం 11 గంటలకు పూర్తి చేస్తారు. ఇక చంద్రుడిపై సజావుగా చంద్రయాన్ వాలే సాఫ్ట్‌ల్యాండింగ్ ఘట్టం ఈ నెల చివరి వారంలో ఉంటుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 నుంచి అంతా సజావుగా ఉంది. ముందుకు వెళ్లుతున్నానని తెలిపే సందేశం ఇస్రో కేంద్రానికి అందింది. దీనిని ఇస్రో వర్గాలు మీడియాకు వెలువరించాయి. ‘మాక్స్ ఇస్ట్రాక్ ,,నేను చంద్రయాన్ 3ను , ఇప్పుడు నేను చంద్రుడి ఆకర్షణకు గురయ్యాను’ అని ఈ సందేశంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News