Sunday, January 19, 2025

భారతదేశ చంద్రయాన్ యాత్ర.. కీలక మజిలీలు

- Advertisement -
- Advertisement -

ఇస్రో తలపెట్టిన చంద్రయాన్‌కు విశేష సుదీర్ఘ చరిత్ర ఉంది. సంబంధిత చంద్రుడి అన్వేషణ క్రమపు ఘట్టాల విషయాలు పలు దశల్లో సాగిన మలుపులు అనేకం ఉన్నాయి.

వాటి వివరాలు:

2003 ఆగస్టు 15: అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రుడిపై అన్వేషణ దిశలో ఇస్రో విశిష్ట పరిశోధనలు చేపడుతుందని దీనికి చంద్రయాన్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు.
2008 అక్టోబర్ 22: చంద్రయాన్ 1 శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగంగా దూసుకువెళ్లింది.
2008 నవంబర్ 8ః చంద్రయాన్ 1 చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది.
2008 నవంబర్ 14: చంద్రయాన్ 1 నుంచి చేపట్టిన అన్వేషణల క్రమంలో చంద్రుడి దక్షిణ ధృవంలో అపార జలరాశులు ఉన్నట్లు గుర్తించారు, చంద్రుడు నిజానికి జలకణజాలపు ఉపరితల సంచలిత ప్రాంతంగా ఉన్నాడని నిర్థారించారు.
2009 ఆగస్టు 28ః చంద్రయాన్ 1 పరిశోధనల దశ ముగిసినట్లు ఇస్రో తెలిపింది.
2019 జులై 22: చంద్రయాన్ 2ను శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగించారు. ఇది ఈ దశలో విజయవంతం అయింది.
2018 ఆగస్టు 20: చంద్రయాన్ 2 వ్యోమనౌకను చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టారు.
2019 సెప్టెంబర్ 2: విక్రమ్ ల్యాండర్‌ను వేరు చేశారు. దక్షిణ ధృవంలో 100 కిలోమీటర్ల ఎత్తున ఇది చంద్రుడిపై ల్యాండ్ అయ్యే దశలో సరైన విధంగా కమ్యూనికేషన్స్ లేకపోవడంతో సవ్యంగా ల్యాండ్ కాలేకపోయింది.
2023 జులై 2023: చంద్రయాన్ 3 ప్రయోగం శ్రీహరికోట నుంచే సాగి విజయవంతం అయింది. ఆగస్టు 23 లేదా 24కు చంద్రుడి ఉపరితలంపై వాలాల్సి ఉంది. దీనితో ఇటువంటి ఘనకీర్తి దేశాల సరసన చేరే నాలుగో దేశం కానుంది.

Also Read: హమారా..ఇస్రో మహాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News