Monday, December 23, 2024

అందుకే శివశక్తి పేరు సూచించా…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు సూచించడం వెనుక ఉన్న కారణాన్ని ప్రధాని మోడీ వివరించారు. బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన, విమానాశ్రయం వెలుపల బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “ చంద్రయాన్ 3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పెట్టాం. మనం శివ అనే పదాన్ని శుభంగా భావిస్తాం. దేశం లోని నారీ మణుల గురించి మాట్లాడే సమయంలో శక్తి పదాన్ని వాడతాం. ఆ పేరు వెనుక ఉద్దేశం అదే. అలాగే చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి గుర్తింపునిస్తూ దానిని ‘తిరంగా పాయింట్ ’ అని పిలుచుకుందాం. ” అని అన్నారు. ‘ నేను బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా వెళ్లాను. ఆ సమయంలో చంద్రయాన్ 3 విజయంపై ప్రపంచ దేశాల నుంచి ఎన్నో అభినందన సందేశాలు వచ్చాయి’ అని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News