Sunday, December 22, 2024

చందమామ “పెరట్లో ” రోవర్ ఆటలు.. ఇస్రో నుంచి మరో వీడియో

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : జాబిల్లి ఉపరితలంపై దిగిన చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోథనల్లో నిమగ్నమైంది. ఈ 14 రోజుల కాలవ్యవధిలో చంద్రుడిపై రోవర్ పూర్తి చేయాల్సిన పరిశోధనల లిస్ట్ పెద్దగానే ఉంది. అందుకే .. జాబిల్లి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ అన్వేషణలు సాగిస్తోంది. అయితే బండరాళ్లు, బిలాలలతో నిండిన చందమామపై తాను నడవాల్సిన సురక్షిత మార్గాన్ని కూడా సక్రమంగా ఎంచుకుంటోంది.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇస్రో తాజాగా ఎక్స్ (ట్విటర్)లో పంచుకుంది. “ సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతోంది. ప్రజ్ఞాన్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే, చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్టుగా ఉంది కదా ఈ వీడియో ” అంటూ ఇస్రో సరదాగా రాసుకొచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువ లోని ఉపరితలంపై మొట్టమొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్ ఉనికిని రోవర్ లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్ ) గుర్తించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రజ్ఞాన్ లోని మరో పరికరం కూడా దీన్ని ధ్రువీకరించింది. మరో టెక్నిక్‌తో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్ ఉన్నట్టు గుర్తించింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ దీన్ని ధ్రువీకరించినట్టు ఇస్రో తెలిపింది. “ జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్ ఎలా వచ్చింది ? అంతర్గతంగానే ఉందా ? అగ్నిపర్వతం లేదా ఉల్కల వల్లనా ? వంటి అంశాలను పరిశోధించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది. ” అని ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News