Sunday, January 19, 2025

ఏది ముందు?: చంద్రయాన్ 3నా?.. లూనానా?

- Advertisement -
- Advertisement -

లండన్ : జాబిల్లి వద్దకు ముందు చేరేది ఏ దేశం?.. ఇండియా, రష్యాలలో ఏ దేశపు అంతరిక్ష నౌకలు చంద్రుడి దక్షిణ ధృవం చేరుకుంటాయి? అనేది ఇప్పుడు కీలకమైన స్పేస్ రేస్ అయింది. భారతదేశపు అంతరిక్ష సంస్థ ఇస్రో ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగించారు. ఇదే సమయంలో రష్యా నుంచి లూనా 25 వ్యోమనౌక కూడా కక్షలోకి దూసుకువెళ్లింది. చంద్రుడి ఉపరితలంపై నెలకొని ఉన్న పలు శాస్త్రీయ అంశాలను వెలికితీసేందుకు ఎవరికి వారుగా ఈ రెండు దేశాలు తమ నౌకలను పంపించాయి. సైంటిఫిక్‌గా ఈ పోటీ సాగుతున్న దశలోనే వినువీధిలో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. ఏ వ్యోమనౌక ముందు చంద్రుడిపై వాలుతుంది? అనేది కీలకం అయింది. ఇస్రో అంచనాల మేరకు చంద్రయాన్ 3 ముందుగా దక్షిణ ధృవంపై వాలుతుంది. కానీ దీని వేగాన్ని మించి లూనా 25 సాగిందని, ఇప్పుడు రష్యా నౌకనే ముందు వాలవచ్చు లేదా దాదాపుగా రెండూ సమాన స్థాయిలో చంద్రుడిపై దిగేందుకు వీలుందని భావిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం చంద్రయాన్ 3 ఈ నెల 21 నుంచి 23 మధ్యలో చంద్రుడిపైకి చేరవచ్చు. ఇక లూనా 25 ఈ నెల 23 లేదా 24 తేదీలలో అక్కడికి వెళ్లవచ్చు.

ఇందులో ఎటువంటి తేడాలు వచ్చినా రెండూ ఏకకాలంలో చంద్రుడిపై వచ్చి వాలుతాయి. చంద్రయాన్ 3 ఈ నెల 5న చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగించిన తరువాత 40 రోజులకు సరైన సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువుగా చాకచక్యంగా కదులుతోంది. ప్రపంచస్థాయిలో ఉక్రెయిన్ విషయంపై పలు విధాలుగా అపకీర్తిని తెచ్చిపెట్టుకున్న రష్యా ఇప్పుడు తిరిగి చంద్రుడిపై తన అన్వేషణలను తిరిగి చేపట్టింది. సోవియట్ కాలపు లూనా 24 తరువాత ఐదు దశాబ్దాలకు లూనా 25 చేపట్టారు. ఆగస్టు 10నే లూనా పరీక్ష జరిగింది. నేరుగా చంద్రుడి కక్షలోకి దూసుకుపోవడం ప్రత్యేకత అయింది. భారతదేశపు చంద్రయాన్ 3 కన్నా ముందుగానే ఈ నెల 21న అంటే పరీక్షించిన 11 రోజులకే చంద్రుడిపైకి దీనిని చేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. అత్యంత తేలికైన రీతిలో నౌక నిర్మాణం, సమర్థవంతంగా ఉండే ఇంధన నిల్వలు . అన్నింటికి మించి ఎంచుకున్న అతి తక్కువ దూరపు మార్గం రష్యా యాత్రకు ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అంతరిక్షంలో ఈ విధమైన సముచిత పోటీ మంచిదే అని ఇస్రో మాజీ బాస్ కె శివన్ అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశోధనలు, అన్వేషణలు ఆసక్తికరమే, ఇదే దశలో ప్రయోజనకరమైన పోటీ సముచితమే అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News