Thursday, January 23, 2025

జులై 13న చంద్రయాన్ 3 ప్రయోగం : ఇస్రో అధికారిక ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్ 3 ప్రయోగం జులై 13న జరుగుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అధికారికంగా వెల్లడించారు. ప్రయోగ లాంచ్ విండో జులై 19 వరకు ఉందని తెలిపారు. ఈ ప్రయోగ తేదీపై ఇటీవల అనధికారిక వార్తలు వచ్చిన విషయంతెలిసిందే. వాటిపై అప్పట్లో స్పందించిన సోమ్‌నాథ్ తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.

తాజాగా దీనిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌లాండింగ్‌లో విజయవంతమవుతాయని విశ్వాసంగా ఉన్నామని చెప్పారు. జులై 13 నుంచి 19 వరకు లాంచ్ విండో అందుబాటులో ఉందని , తొలిరోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. చంద్రయాన్ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ ఎం3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం పనులు చివరిదశకు చేరుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News