Tuesday, November 5, 2024

చంద్రయాన్ -3 ల్యాండింగ్ సమయంలో పుట్టిన పిల్లలకు చంద్రయాన్ పేర్లు

- Advertisement -
- Advertisement -

కేంద్రపర (ఒడిశా) : జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ కావడం భారత్ అఖండ కీర్తి ప్రపంచమంతా విస్తరించింది. దేశ ప్రజల్లో అవధు లు లేని ఆనందం ఉప్పొంగింది. బుధవారం సాయంత్రం చంద్రయాన్3 ల్యాండింగ్ అయిన కొద్ది సేపటికే ఒడిశా లోని కేంద్రపర జిల్లాలో జన్మి ంచిన అనేక మంది శిశువులకు “చంద్రయాన్‌” అని తల్లిదండ్రులు పేరు పెట్టడం విశేషం. కేంద్రపర జిల్లా ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం ముగ్గురు మగ బిడ్డలు, ఒక ఆడబిడ్డ జన్మించారు. అందులో ఒక శిశువు కు తల్లిదండ్రులు చంద్రయాన్ అని పేరు పెట్టారు.

Also Read: ఒక్క శాతం లేనివారికి నాలుగు మంత్రి పదవులా?: ఈటల

చంద్రయాన్ 3 వి జయవంతంగా ల్యాండింగ్ అయిన తరువాత కొన్ని నిమిషాలకే మగబి డ్డ జన్మించాడని , ఈ రెట్టింపు ఆనందంలో తమ బిడ్డకు చంద్రయాన్ అ ని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆ బిడ్డ తండ్రి వెల్లడించారు. శిశువు పుట్టిన 21 వ రోజున పేరు పెట్టడం స్థానిక సంప్రదాయంగా వ స్తోంది. అయితే తమ మగ బిడ్డకు చంద్రయాన్ పేరు పెట్టాలని పెద్దలకు సూచిస్తామని అరిపాడు గ్రామానికి చెందిన మల్లిక్ భార్య రాణు తెలిపా రు. చంద్రయాన్ అంటే చంద్రునికి వాహనం అని అర్ధం. కాబట్టి పిల్లల పేరు చంద్ర లేదా లూనా అని కూడా ఉండవచ్చని ఆమె చెప్పారు. అయి తే చంద్రయాన్ అనేది స్టైలిష్ పేరు. 21 రోజు తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

దుర్గా మండలం తలచువా గ్రామానికి చెందిన జోష్నారాణి, నీలకంఠాపూర్‌కు చెందిన బాల్, అంగులేయ్ గ్రా మానికి చెందిన బేబీనా సేథీ, కూడా ఆగస్టు 23న సాయంత్రం బిడ్డలను ప్రసవించారు. దుర్గకు పుట్టిన పాప ఆడపిల్ల కాగా, మరో ఇద్దరు మగపిల్లలు. వీరితల్లులంతా తమ బిడ్డలకు చంద్రయాన్ పేరు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి హెడ్‌నర్సు అంజనా సాహూ వి వరించారు. గతంలో కోస్తా జిల్లాలను తుపాన్లు తాకినప్పుడు ఆ తుపాన్ల పేర్లను తమ బిడ్డలకు తల్లిదండ్రులు పెట్టేవారని ఆమె గుర్తు చేశారు. దే శంలో చారిత్రక సంఘటన సందర్భంగా తమ బిడ్డలు జన్మించడం తమ కు గర్వకారణంగా ఉందని కొందరు తల్లిదండ్రులు ఆనందిస్తున్నారని ఆస్పత్రి అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పికె ప్రహరాజ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News