హైదరాబాద్: కాళ్లు చేతులు కట్టేసి అనంతరం గొంతు కోసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్‌కు చెందిన మసీయుద్ధీన్(57) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. షబానాను మూడో భార్యగా పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు అప్పటికే షమీర్ అనే కుమారుడు ఉన్నాడు.
బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్‌షిప్‌లో ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఆమె అద్దెకు ఉంటుంది. మసీయుద్ధీన్ రోజు ఆమె వద్దకు వచ్చి వెళ్లేవాడు. షబానా, మసీయుద్దీన్ గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం మళ్లీ ఆమె ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో కుమారుడు సమీర్, స్నేహితుడు ఫరీద్ ఉన్నారు. ప్లాన్‌లో భాగంగా మసీయుద్దీన్ చేతులు, కాళ్లు కట్టేసి అనంతరం గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నిందితులు బండ్లగూడ పిఎస్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.