- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య గొడవ ముదరడంతో యువకుడి హత్యకు దారితీసింది. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి డిఅర్డిఎల్ రోడ్డుపై ఓ యువకుడి కండ్లలో కారం చల్లి కత్తులతో దుండగులు హత్య చేశారు. భవాని నగర్ ప్రాంతంలో నివసిస్తున్న షాకీర్(30) కొద్ది రోజుల క్రితం స్నేహితులతో గొడవ పడ్డాడు. స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతోష్ నగర్ నుంచి బండ్లగూడ వెళ్తుండగా టాటా ఎసి ఆటోను వెంబడించి ఆటో డ్రైవర్ ను ముగ్గురు వ్యక్తులు కండ్లలో కారం చలి కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -