Sunday, January 19, 2025

అప్పటి నుంచి చందు పవిత్రతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు: శిల్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఐదు సంవత్సరాల నుంచి పవిత్రతో తన భర్త చందు వివాహేదర సంబంధం కొనసాగిస్తున్నారని ఆయన భార్య శిల్ప తెలిపారు. బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై భార్య శిల్ప స్పందించారు. త్రినయిని సీరియల్ ప్రాజెక్ట వచ్చినప్పటి నుంచి వారి మధ్య అక్రమ సంబంధం ఉందని, ఆమె మాయలో పడి తనని పట్టించుకోలేదని, తన కుటుంబాన్ని కూడా వదిలేశాడని ఆమె పేర్కొన్నారు. ఆయన తన వెంటపడి ప్రేమపెళ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం మాకు ఇద్దరు పిల్లల ఉన్నారని తెలియజేశారు. వివాహం తరువాత అక్రమ సంబంధాలనేవి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని శిల్ప వివరించారు. పవిత్ర హఠాన్మరణంతో చందు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, ఇటీవల కత్తితో కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, పవిత్ర దగ్గరకు వస్తున్నానని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పెట్టారన్నారు.

వెంటనే ఆయనకు ఫోన్ చేశానని లిఫ్ట్ చేయలేదని, దీంతో తనకు తెలిసిన వారిని చందు ఫ్లాట్‌కు పంపించానని చెప్పారు. అప్పుడు ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. పవిత్రతో కలిసి చందు ఓ ప్రాజెక్టు విషయంలో బెంగళూరు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో చంద్రు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో చందు కనిపించడంతో పవిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు వెల్లడించిన విషయాన్ని చందు మీడియాకు తెలిపారు. చందు ఆత్మహత్య చేసుకోవడమనేది సంచలనం సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News