Wednesday, January 22, 2025

భక్తితో కూడిన అడ్వెంచర్ మూవీ

- Advertisement -
- Advertisement -

Sathi Muthyam movie release on Oct 5th

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ’2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మొండేటి పాత్రికేయులతో మాట్లాడుతూ “చిన్నప్పటినుండి నేను రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. అలా ఇతిహాసాలపై ఎక్కువ ఆసక్తి ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం.

శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్. దాన్ని బాట్టి ఈ సినిమాను తీయడం జరిగింది. భక్తితో పాటు అడ్వెంచర్‌తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు. ‘కార్తికేయ ’లో నిఖిల్ హీరోగా చేయడంతో ‘కార్తికేయ 2’లో నటించడం చాలా ఈజీగా అయింది. అందులో మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తే ఇందులో డాక్టర్‌గా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వైవా హర్ష, సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్ నమ్మి మాతో ప్రయాణించారు. కథ హిమాచల్ ప్రదేశ్‌లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది. ఆయన సీన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. వియఫ్‌ఎక్స్ వర్క్ చాలా బాగా వచ్చింది”అని అన్నారు.

Chandu Mondeti about ‘Karthikeya 2’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News