Sunday, January 19, 2025

కాల్ సెంటర్ పెట్టి… సమస్యలు వింటా

- Advertisement -
- Advertisement -

గెలుపుకోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓట్ల కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. భూపాలపల్లి బీజేపి అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి తనను గెలిపిస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ పెడతానన్నారు. అలాగే భూపాలపల్లికి రైల్వే లైన్ కూడా తీసుకొస్తానన్నారు.

భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణరావుకు పార్టీలు మారడంలో ఎంతో పేరుందనీ, ఆయన ఎప్పుడు ఏ పార్టీనుంచి పోటీ చేస్తారో అర్థం కావడం లేదని కీర్తిరెడ్డి విమర్శించారు. పూటకో పార్టీ మార్చే నేతలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా ఈ సభలో ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News