Wednesday, January 22, 2025

విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చండి: సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తప్పు కున్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కెసిఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగుతున్న సమ యంలోనే ఆయన లేఖ రాశారు. భోజన విరామ సమయంలో న్యాయవాది ద్వారా కోర్టుకు తన లేఖ పంపారు. లేఖను న్యాయవాదులు, సుప్రీం కోర్టుకు అందించారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించి, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కమిషన్ విచారణ కొన సాగించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. వచ్చే సోమవారంలోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

అంతకు ముందు కెసిఆర్ వేసిన పిటిషన్‌పై సుధీర్ఘవాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్ విచారణ జరు పుతున్నారని కెసిఆర్ తరఫు లాయర్ వాదనలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొను గోలు చేయాల్సి వచ్చిందని సిజెఐ ధర్మాసనానికి చెప్పారు. ఎన్నికలకు ముందే ప్రస్తుత సిఎం ఆర్‌టిఐ ద్వారా అనేక సమాచారాలు సేకరించి పెటు ్టకున్నారని వెల్లడించారు. వాటి ఆధారంగా ముందస్తు ఆలోచనతోనే కక్షసాధింపు ధోరణితో ఇప్పుడు కమిషన్ వేశారన్నారు. విచారణ జరుపుతున్న కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టారని కెసిఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రెస్‌మీ ట్‌పై సిజెఐ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్‌లో, అభిప్రాయాలు వ్యక్తపర్చడం సరికాదని పేర్కొంది. విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చా లని ఆదేశించింది. కమిషన్ ఛైర్మన్‌ను మార్చేందుకు, తెలంగాణ సర్కార్ అంగీకరించింది. మధ్యాహ్నం మరో పేరును వెల్లడిస్తామని, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వెల్లడించారు. ఈలోపే జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి, కమిషన్ ఛైర్మన్‌గా తప్పుకుంటూ లేఖ రాశారు. కొత్త ఛైర్మన్‌ను నియమించి విచారణ కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. సోమ వారం లోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తర్వాత కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సిజెఐ ప్రకటించారు.

కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కెసిఆర్ పిటిషన్
విద్యుత్ కమిషన్ నియామకం,ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ముందుగానే అభిప్రాయాలు చెప్పడం వంటి వాటిపై కెసిఆర్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశా లపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ వేయగా కెసిఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కెసిఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ గులా బీ బాస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ చైర్మన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముందే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమంటున్న కెసిఆర్
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం -2003కి అది విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కెసిఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప, దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తుత విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం పైనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: ప్రశాంత్‌రెడ్డి
విద్యుత్ విచారణ కమిషన్‌పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధర్మాసనం వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. విచారణ పేరిట కెసిఆర్‌ను బదనాం చేయాలన్న కుట్ర జరుగుతుందని పునరుద్ఘాటించారు. సిజెఐ వ్యాఖ్యలు తమ వాదనకు బలం చేకూరుస్తున్నాయన్నారు. మంచి పనులు చేసినా బురదజల్లాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని దుయ్యబట్టారు. సిఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి దుర్బుద్ధి రాజకీయాలు మానాలని కోరారు.

ప్రెస్ మీట్ పెడితే తప్పేంటి?: జస్టిస్ నర్సింహారెడ్డి
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ మీడియా ఛానల్ తో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాథమిక వాదోపవాదాలు మాత్రమే విన్నదని, ఈ ఇష్యూపై ఇంకాస్త లోతుగా విచారించి ఉంటే నేను నా అభిప్రాయం చెప్పానో లేదో తెలిసేదని, దీనిపై లోతైన విచారణ వద్దని కోర్టు కూడా భావించిందని చెప్పుకొచ్చారు. అలాగే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ప్రెస్ మీట్లు పెడుతుంది. కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వైరీ అని అర్థం. కమిషన్ ప్రెస్ మీట్ పెడితే తప్పేంటి. తాను ప్రెస్ మీట్‌లో ఎటువంటి ఫ్యాక్ట్ ముందుగా చెప్పలేదన్నారు. అలాగే ఒక జస్టిస్ హోదాలో ఉన్న తనకు ఎలాంటి పక్షపాతం లేదని, అలా పక్షపాతంగా వ్యవహరిస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News