Saturday, November 16, 2024

ఇఎపిసెట్, ఐసెట్ షెడ్యూల్‌లో మార్పు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. టిఎస్‌ఇఎపిసెట్ (ఎంసెట్), ఐసెట్ పరీక్షను పరీక్షల షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇఎపిసెట్ పరీక్షలు మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే తేడా ఉండటంతో విద్యార్థులు గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇఎపిసెట్ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 5, 6వ తేదీల్లో టిఎస్ ఐసెట్ పరీక్ష జరగనుంది.

మారిన ఇఎపిసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్

మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఇఎపిసెట్ మే 7 నుంచి 11 వరకు రీ షెడ్యూల్

మే 7,8 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు

మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

జూన్ 4,5 తేదీలలో జరగాల్సిన ఐసెట్ జూన్ 5,6 తేదీలకు మార్పు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News