Monday, December 23, 2024

భూగోళ అంతర్భాగ భ్రమణంలో మార్పు

- Advertisement -
- Advertisement -

భూమి అంతర్భాగంలో తీవ్రమైన సుడులు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరిగితే తప్ప ఎలాంటి మథనాలు జరిగినా మనకేం కుదుపులు అనిపించవు. అయితే భూమి అంతర్భాగం భ్రమణంలో 2009 లోనే మార్పు వచ్చి ఆగిపోయి, వ్యతిరేక దిశలో మారిందని కొత్త పరిశోధనలో బయటపడింది. నేచర్ జియో సైన్స్‌లో ఈ అధ్యయనం వెలువడింది. భూమి ఉపరితలానికి సంబంధించి అంతర్భాగం ఈతకొట్టినట్టు వెనక్కు ముందుకు భ్రమణం సాగిస్తుందని చాలా కాలంగా పరిశోధకులు నమ్ముతున్నారు.

ఒక భ్రమణ చక్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు సాగుతుంది. అంటే ఈ భ్రమణ దిశ దాదాపు ప్రతి 35 సంవత్సరాలకు మారుతుంది. గతంలో ఈ విధంగా భ్రమణ దిశ 1970 మొదట్లో మారింది. మళ్లీ 2040 మధ్యలో దిశ మారుతుందని చైనా పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే భూమి అంతర్భాగం ( ఇన్నర్ కోర్ ) అంటే ఏమిటి ? ఇది పై పొర, మధ్య పొర, అంతర్భాగం అనే మూడు భాగాలతో ఉంటుంది.

ఈ అంతర్భాగాన్ని మొదట 1936 లో పరిశోధకులు కనుగొన్నారు. భూకంపాల నుంచి వచ్చే భూకంప తరంగాలు భూగోళంలో ప్రయాణిస్తుంటాయి. ఈ తరంగాల్లో వచ్చిన మార్పే అంతర్భాగంగా వెల్లడైంది. ఇది 7000 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. లోపల ఇనుప ద్రవంతో నిండి పైకి చాలా కఠినమైన పొరగా ఇనుప ఘన కేంద్రంగా తయారౌతుంది. 1996లో వెలువడిన అధ్యయనం ప్రకారం భూకంప తరంగాల ప్రయాణం భూమి అంతర్భాగం లోంచి స్వల్పంగా సాగినట్టు తేలినా, గత మూడు దశాబ్దాలుగా క్రమబద్ధమైన వైవిధ్యం అంతర్భాగ భ్రమణంలో కనిపించింది.

అంతర్భాగాల రోజువారీ భమణం కన్నా ఏడాదికి 1 డిగ్రీ వంతున భ్రమణ వేగం పెరుగుతోంది. పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 1995 నుంచి 2021 మధ్యకాలంలో సంభవించిన భూకంపాలను విశ్లేషించగా, 2009లో ఏదో ఒక సమయంలో భూమి అంతర్భాగం భ్రమణాన్ని ఆపి వేసినట్టు తేలింది. బహుశా భ్రమణ దిశను మార్చే ప్రక్రియలో ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ఈ భ్రమణం రోజు పొడవులో మార్పులకు సంబంధమై ఉంటుంది.

ఇది భూమి తన అక్షాంశంపై పరిభ్రమించే కచ్చితమైన సమయంలో స్వల్ప తేడాలకు దారి తీస్తుంది. భూమి లోని మూడు విభిన్న పొరల మధ్య కూడా ఈ సంబంధాలు ఉంటాయి. మొత్తం భూగోళాన్ని సమగ్ర క్రియాశీల వ్యవస్థగా పరిగణించడానికి వీలుగా పరిశోధకులు నమూనాలు రూపొందించేందుకు, పరీక్షించేందుకు తమ అధ్యయనం ప్రోత్సాహం కలిగించగలదని పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News