Monday, January 20, 2025

జెబిఎస్, ఎంజిబిఎస్‌ల మధ్య మెట్రో రైళ్ల సమయంలో మార్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీ బస్‌స్టేషన్ (జెబిఎస్), మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజిబిఎస్) మధ్య కారిడార్ II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. గతంలో ఆర్టీసి క్రాస్‌రోడ్డులో మెట్రో కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న కారణంగా టైమింగ్స్ ఉదయం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, సవరించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ఆఫీసు వేళల్లో మెట్రోల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News