Saturday, January 18, 2025

పాలిసెట్ పరీక్ష తేదీలో మార్పు

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్ పాటిసెట్)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మే 17న జరగాల్సిన పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పాలిసెట్ పరీక్షను వాయిదా వేశారు. గత నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ వెలువడగా, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటిక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News