Monday, January 20, 2025

భారీగా భూ మార్పిడి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఎండిఎకు పెరుగుతున్న సిఎల్‌యు దరఖాస్తులు
111 జిఒ ఎత్తివేతతో మారిన సీన్ 
మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే వాటికి మోక్షం
త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

111 జిఓ ఎత్తివేతతో ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సిఎల్‌యు) కోసం హెచ్‌ఎండిఏకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఒక జోన్ నుంచి మరో జోన్‌లోకి మా ర్పు చేయాలంటే ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సిఎల్‌యు) తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం హెచ్‌ఎండిఏకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ మంత్రి నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలపా లి. హెచ్‌ఎండిఎ మాస్టర్‌ప్లాన్ 2011లో ఉన్న జోన్‌లను మార్పు చేయడానికి పెద్దఎత్తున హెచ్‌ఎండిఎకు దరఖాస్తులు వస్తున్నాయి. 111 జీఓ తొలగింపు నేపథ్యంలో ఈ దరఖాస్తులు వస్తున్నాయని, ప్రభుత్వం మార్గదర్శకాలు వచ్చిన తరువాతే వాటిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే హెచ్‌ఎండిఎ అధికారులు ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందించారు.

ప్రస్తుతం దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. 111 జిఒ ప్రాంతంలోని 84 గ్రామాల కోసం హెచ్‌ఎండిఎ త్వరలోనే ఓ మాస్టర్‌ప్లాన్ రూపొందించే పనిలో ఉన్నట్టుగా తెలిసిం ది. పదేళ్ల క్రితం రూపొందించిన హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో 12 జోన్లు ఉన్నాయి. ఈ 84 గ్రా మాలను ఏ జోన్‌లోకి తీసుకోలేదు. 84 గ్రామాల్లోని భూములన్నీ ఆంక్షల మధ్య బయో కన్జర్వేషన్ జోన్‌లో ఉన్నాయి. బయో కన్జర్వేషన్ జోన్ ను వ్యవసాయ కన్జర్వేషన్ జోన్‌గా పరిగణిస్తేనే ఈ దరఖాస్తులకు మోక్షం కలుగుతుందని హెచ్‌ఎండిఏ అధికారులు పేర్కొంటున్నారు.

త్వరలోనే బయో కన్జర్వేషన్ జోన్‌ను తొలగించి, నాలా కన్వర్షన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారమే 111 జీఓ ఏరియాలోని భూములను భూ యజమానుల విజ్ఞప్తి మేర కు సీఎల్‌యూ కింద రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా కోరుకున్న జోన్‌లకు మార్పు చేయనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఐదు మాస్టర్‌ప్లాన్‌లు ఉండగా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే ప్రయత్నంలో భాగంగా వాటిని కలిసి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌గా రూపొందించాలని గతంలో కెసిఆర్ ఆదేశించారు. తర్వాత ఓఆర్‌ఆర్ లోపల, బయట వేర్వేరు మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని సిఎం సూచించారు. అందులో భాగంగా ఈ పనిని ఆస్కీకి అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులుగా ఆధారంగా 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల భూములను హెచ్‌ఎండిఏ మాస్టరప్లాన్ 2031లో బయో కన్జర్వేషన్ జోన్‌గా కాకుండా వ్యవసాయ కన్జర్వేషన్ జోన్‌గా పరిగణించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News