Monday, December 23, 2024

ఢిల్లీలో మరో మొఘల్ గార్డెన్ పేరు గౌతమ బుద్ద సెంటెనరీగా మార్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీ నార్త్ క్యాంపస్‌లోని మొఘల్ గార్డెన్ పేరు గౌతమ బుద్ధ సెంటనరీగా మార్చారు. ఈ గార్డెన్‌కు మొఘల్ డిజైన్ లేనందున హేతుబద్ధంగా యూనివర్శిటీ గౌతమ్ బుధ్ధ సెంటెనరీగా ఈనెల 27న పేరు మార్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్రపతి భవన్ కూడా శనివారం తన ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్‌ను అమృత ఉద్యాన్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. గార్డెన్ కమిటీతో సుదీర్ఘ చర్చలు జరిగిన తరువాత పేరు మార్చడమైందని, యూనివర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉద్యానవనంలో గత 15 ఏళ్లుగా గౌతమ బుద్ధుని విగ్రహం ఉండడంతో పేరు మార్చడానికి నిర్ణయమైందని రిజిస్ట్రార్ వికాస్ గుప్త నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News