Monday, December 23, 2024

ఆగస్టులో వచ్చే కొన్ని మార్పులివే…

- Advertisement -
- Advertisement -

Changes coming From 1st August

న్యూఢిల్లీ : ఆగస్ట్ నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెలలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులతో మీ జెబు, జీవితంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం పడనుంది. అందుకే నిబంధనలకు సంబంధించిన సమాచారం సరైన అవగాహన పెంచుకోవాలి. మార్పుల విషయానికొస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చే నెల నుంచి చెక్కుల చెల్లింపు నిబంధనలను మార్చబోతోంది. ఆగస్టు 1 నుంచి ఐటిఆర్ ఫైల్ చేసేందుకు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కెవైసి కోసం జూలై 31 వరకు సమయం ఇచ్చారు. ఆగస్టులో వచ్చే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.

ఐటిఆర్ దాఖలుకు లేట్ ఫీ
ఐటిఆర్(ఆదాయ పన్ను రిటర్న్) ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ జూలై 31, అంటే ఆగస్టు 1 నుండి పన్ను చెల్లింపుదారులు ఐటిఆర్ ఫైల్ చేయడానికి లేట్ ఫీ(ఆలస్య రుసుము) చెల్లించాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అలాంటి వారు రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే లేట్ ఫీ రూ. 1,000 చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఐటి వెబ్‌సైట్‌ను సందర్శించండి.

గ్యాస్ సిలిండర్లు ఖరీదైనవి కావచ్చు
ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తారు. ఈ పరిస్థితిలో పెరుగుతున్న సహజ వాయువు(నాచురల్ గ్యాస్) ధరల కారణంగా ఈసారి గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్యులపై మరింత భారం పెంచనుంది.

పాజిటివ్ పే సిస్టమ్‌ను అమలు
బ్యాంక్ ఆఫ్ బరోడా తన చెక్ చెల్లింపు నియమాలలో కొన్ని మార్పులు చేయనుంది. వచ్చే నెల 1 నుంచి రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల చెల్లింపునకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి అని బ్యాంక్ తన ఖాతాదారులకు తెలిపింది. చెక్కు చెల్లింపులను సురక్షితంగా చేయడానికి, బ్యాంక్ మోసాన్ని నిరోధించడానికి ఈ మార్పులు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం బిఒబి వెబ్‌సైట్‌ను సందర్శించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News