Wednesday, January 22, 2025

కొలీజియం లోకి జస్టిస్ బి. ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వం లోని కొలీజియంలో మార్పులు, చేర్పులు జరిగాయి. కొలీజియం సభ్యులు జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లను సీజేఐ తీసుకున్నారు, కొత్త కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లకు భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి శెలవుల్లో ఉన్న సుప్రీం కోర్టు వచ్చేనెల 3న మళ్లీ ప్రారంభం కానుంది.

ఇటీవల ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో సుప్రీం కోర్టు జడ్జీల సంఖ్య పూర్తి సామర్ధమైన 34 సభ్యుల నుంచి 31 కి తగ్గిపోయింది. జులై 8 న జస్టిస్‌కృష్ణ మురారి కూడా పదవీ విరమణ చేయనున్నారరు. దీంతో ఈ సంఖ్య 30 కి పరిమితం కానుంది. ఈ ఖాళీలను కొత్త కొలీజియం భర్తీ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసే ముగ్గురు సభ్యుల కొలీజియం లోనూ ఒక మార్పు జరిగింది. జస్టిస్ కె.ఎం . జోసెఫ్ స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చారు. సీజేఐ జస్టిస్ డి. వై. చంద్రచూడ్ , జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇందులోని ఇతర సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News