Wednesday, January 22, 2025

ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక మార్పులు ఏమిటి?

- Advertisement -
- Advertisement -

ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలు కానున్నది. బడ్జెట్ 2023లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన పెట్టుబడి, లక్ష్యాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రుణం తీసుకోవాలంటే భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) పాలసీ ప్రకటనను చూడాల్సి ఉంటుంది. పన్నుల్లో వచ్చిన మార్పులను , జాతీయ పింఛను విధానం(ఎన్‌పిఎస్) నుంచి ఉపసంహరణ, పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి వంటివి చూడాల్సి ఉంటుంది. మీ పర్సుపై ప్రభావం చూపే మార్పులు ఏమిటన్నది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం కూడా అమలు కానున్నది. కొత్త పన్ను విధానంలో రిబేట్ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. కనీస మినహాయింపు పరిమితి కూడా ఏప్రిల్ 1 నుంచి మారనున్నది. లీవ్ ట్రావెల్ అలవెన్స్(ఎల్‌టిఎ) ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షలకు బడ్జెట్ 2023లో పెంచారు. మార్కెట్ లింక్డ్ డిబేంచర్లను షార్ట్ టర్మ్ అసెట్స్‌గా పరిగణిస్తారు.ఒకవేళ ఫిజికల్ బంగారంను ఎలక్ట్రానిక్ బంగారంగా మార్చుకున్నా వైస్‌వర్సాగా మార్చుకున్నా ఎలాంటి గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎలాంటి ఎల్‌టిసిజి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను రాయితీలు ఉండవు వాటిని మీ ఆదాయం కింద లెక్కించి పన్ను విధిస్తారు. అది కూడా మీ స్లాబ్ అనుసారంగా. ఇప్పటి వరకు డెట్ ఫండ్స్‌పై వచ్చే ఆదాయాన్ని ఒకవేళ మూడేళ్లకు మించి యూనిట్లను కలిగి ఉంటే లాంగ్ టర్మ్‌గా భావించేవారు. ఇప్పటి వరకు ఎల్‌టిసిజికి ఇండెక్షేన్ తర్వాత 20 శాతంగా విధించేవారు. కానీ ఏప్రిల్ 1 తర్వాత ఆ మినహాయింపు ఉండదు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సిఎస్‌ఎస్) పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ ఇచ్చేవారు. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఓ సారి ఇస్తారు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద పెట్టుబడి పరిమితిని రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. ఒకవేళ అది జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. ఈ స్కీమ్ కింద నెలకు 7.1 శాతం వడ్డీ చొప్పును 2023 జనవరి నుంచి మార్చి వరకు వడ్డీ చెల్లిస్తారు. ఎస్‌సిఎస్‌ఎస్, పిఓఎంఐఎస్ రెండింటి కాల పరిమితి పెట్టుబడి పెట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పిఎఫ్‌ఆర్‌డిఎ) 2023 ఏప్రిల్ 1 నుంచి కొన్ని డాక్యుమెంట్లను తప్పనిసరి చేసింది. ఆ పత్రాలను సెంట్రల్ రికార్డింగ్ ఏజెన్సీ(సిఆర్‌ఎ) సిస్టంకు అప్‌లోడ్ చేస్తారు. ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్‌లు, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్(పిఆర్‌ఎఎన్)కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆస్తుల కొనుగోళ్ల కోసం, వైద్య చికిత్స కోసం మీరు ఎన్‌పిఎస్ ఖాతా నుంచి డబ్బును తీసుకోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టి నప్పటి నుంచి మూడు సార్లకంటే ఎక్కువ తీయడానికి కుదరదు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మానిటరీ పాలిసీ కమిటీ(ఎంపిసి) రెపో రేటును 250 బేసిస్ పాయింట్లకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెంచింది. రెపో రేటు మరో 25 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఏప్రిల్ 1 నుంచి భారత దేశపు అన్ని నగల దుకాణాలలో హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడి) నంబర్ ఉన్న నగలను అమ్మడానికే అనుమతిస్తారు. దీని ద్వారా కొన్నవారికి బంగారం వాస్తవానికి ఎంత ధరకి కొన్నారన్నది నిర్ధారణ అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ ఖాతా టారిఫ్ స్ట్రక్చర్‌ను రివైజ్ చేసింది. యావరేజ్ బ్యాలెన్స్ త్రైమాసికానికి రూ. 75000గా ఉన్నది కాస్తా ఇప్పుడు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌గా(ఎఎంబి)గా మార్చింది. ఒకవేళ కనీస నిల్వ ఉంచకున్నా లేక నిల్ బ్యాలెన్స్ ఉన్న నెలకు రూ. 50 నుంచి రూ. 600 వరకు చార్జీలు వసూలు చేసే ఆస్కారం ఉంది. ఇన్‌వార్డ్ చెక్ రిటర్న్ ఛార్జెస్‌ను కూడా రూ. 50 నుంచి రూ. 150 ఒక్కో ట్రాన్సాక్షన్‌కు పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News