Monday, January 20, 2025

ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా
సెప్టెంబర్ 6 తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కాకతీయ వర్సిటీ వెల్లడి

మన తెలంగాణ: కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు వర్సిటీ వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17న ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. 22వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకాతీయ వర్సిటీ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News