Friday, November 22, 2024

ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ వ్యవస్థల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యుపిఐ అందుబాటులోకి రాకముందు నగదు పంపాలంటే ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ వ్యవస్థలను వినియోగించేవారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్‌కు నగదు బదిలీ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఇఎఫ్‌టి), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టిజిఎస్) ద్వారా దేశంలోకి వస్తున్న విదేశీ విరాళాల నిబంధనల్లో ఆర్‌బిఐ మార్పులు చేసింది. ఈ విధానాల్లోకి ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్ ) యాక్ట్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. సాధారణంగా మధ్య జరిగే లావాదేవీల కోసం సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సియల్ టెలికమ్యూనికేషన్ (ఎస్‌డబ్లూఐఎఫ్‌టి) వినియోగిస్తారు.

విరాళం ఇస్తున్నవారి పేరు, చిరునామా, విరాళం మొత్తం విలువ తదితర వివరాలను తెలపాలని ఆయా బ్యాంకులను ఆర్‌బిఐ తెలిపింది. ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ విధానాలు అనుసరిస్తున్న బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ ద్వారా విదేశీ విరాళాలను ఎస్‌బిఐకి ఫార్వార్డ్ చేసేటప్పుడు వివరాలను తెలిపేందుకు కోర్‌బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని సభ్య బ్యాంకులను ఆర్‌బిఐ కోరింది. విదేశీ దాతల వివరాలను నివేదించాలని కేంద్ర హోంశాఖ ఎస్‌బిఐని కోరడంతో ఆర్‌బిఐ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టంప్రకారం ఆర్‌టిజిఎస్ వ్యవస్థల్లో మార్పులు చేసింది. కాగా ప్రకారం ఎస్‌బిఐ న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ (ఎన్‌డిఎంబి)లోని ఎఫ్‌సిఆర్‌ఎ ఖాతాలో మాత్రమే విదేశీ విరాళాలు జమచేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News