Monday, October 28, 2024

పాక్‌కు కొత్త సారథి

- Advertisement -
- Advertisement -

వన్డే, టి20లకు మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేసిన పిసిబి
ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు జట్టు ప్రకటన

లాహోర్: పాకిస్థాన్ జట్టులో మార్పులు చేర్పులు జరగుతున్నాయి. అందులో భాగంగా జట్టుకు కొత్త సారధిని ఎంపిక చేశారు. వన్డేలు, టి20లకు సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్/బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా నియమించాడు. ఇక ఆల్‌రౌండర్ సల్మాన్ అఘాను వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ చేశారు పాక్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు. గత రెండేళ్లలో పాకిస్థాన్ జట్టుకు సారథిగా బాధ్యతలు అందుకున్న నాలుగో వ్యక్తి మహ్మద్ రిజ్వాన్. టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.

దీంతో మరోసారి బాబర్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈసారి బాబర్ తన ఆటపై దృష్టిసారించి ఈ నిర్ణయం తీసుకున్నాడని మీడియా సమావేశంలో పిసిబి చీఫ్ మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. దాంతో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించారని ఆయన పేర్కొన్నాడు. నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్టే సిరీస్ నుంచి రిజ్వాన్ సారధ్య బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ వన్డే సిరీస్ అనంతరం టి20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సీరిస్‌లు ముగియగానే పాక్ జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. కాగా, ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన బాబార్ అజామ్, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా తిరిగి స్థానం దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైన వాళ్లు జింబాబ్వే పర్యటనలోని వన్డే, టీ20 సిరీస్‌లకు చోటు దక్కించుకోలేదు.

ఫకర్ జమాన్‌పై వేటు

సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన 25 మంది ఆటగాళ్ల జాబితాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. 2024-25 సీజన్‌కు సంబంధించిన ఈ కాంట్రాక్ట్‌ల్లో కీలక ప్లేయర్ ఫకర్ జమాన్ చోటు కోల్పోయాడు. ఎనిమిదేళ్లలో అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడం ఇదే తొలిసారి. దీని గురించి పిసిబి ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ ‘బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించడంపై ‘విరాట్ కోహ్లి-’తో పోలుస్తూ చేసిన ట్వీట్ కారణంగానే ఫకర్ జమాన్‌పై వేటు వేశామని, దాంతో పాటు అతని ఫిట్‌నెస్ కూడా ఓ కారణం’ అని పేర్కొన్నాడు. అందుకే సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల్లో వన్డే, టీ20 సిరీస్‌లకు ఫకర్ జమాన్ ఎంపిక చేయదు’ అని అన్నాడు. ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు పాకిస్థాన్ జట్టులో బాబార్ అజామ్ చోటు కోల్పోయాడు. అయితే దీని గురించి ఫకర్ జామన్ ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News