హైదరాబాద్: వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని పల్లెప్రగతి- పట్టణ ప్రగతి సమావేశంలో అధికారులు సిఎం కెసిఆర్ ను కోరారు. సమావేశం విజ్ఞప్తి మేరకు జూన్ 3 తేదీ నుంచి 15 రోజులపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నేడు దేశం గర్వించే స్థాయిలో పల్లె,పట్టణాలు అభివృద్ధి చేస్తున్నామని సిఎం అన్నారు. పల్లె,పట్టణ ప్రగతికి దేశవ్యాప్త గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిసారి 10 ఎంపికయ్యాయని ఆయన పేర్కొన్నారు. రెండోసారి 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపికవ్వడం గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి ప్రగతి సాధిస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాలన్నారు.
పల్లె-పట్టణ ప్రగతి తేదీల్లో మార్పు
- Advertisement -
- Advertisement -
- Advertisement -