Monday, December 23, 2024

ఉమ్మడి పౌర స్మృతి కంటే ముందు వ్యక్తిగత చట్టాల్లో మార్పులు రావాలి

- Advertisement -
- Advertisement -
సిపిఎం నాయకులు బి వి రాఘవులు

హైదరాబాద్ : భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో వివిధ మతాల వ్యక్తి గత చట్టాల్లో ఉన్న వివక్షను తొలగించిన తర్వాత మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి అమలు సాధ్యమవుతుందని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బి వి. రాఘవులు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు పౌరస్మృతిని పాలకులు ముందుకు తీసుకొస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అధ్యయన వేదిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మతాల వ్యక్తి గత చట్టాల్లో మహిళల పట్ల వివక్ష ఉందని, కులాల అంతరాలు, సామాజిక వివక్ష కొనసాగుతోందని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించిన హక్కులకు అనుగుణంగా మతాల వ్యక్తిగత చట్టాలు లేవని పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదాను విడుదల చేయకుండా చర్చ పెట్టటం కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించటానికేనని విమర్శించారు. సెమినార్‌కు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, నాయకులు కె.సోమశేఖర్, టి.లక్ష్మారెడ్డి,మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News