- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈసారి పరీక్షల గదిలోకి వెళ్లిన ప్రతీ విద్యార్థికి పరీక్ష రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ అందజేయనున్నారు. దీంతో విద్యార్థులు అదనపు సమాధాన పత్రాలను అడిగే ఇబ్బంది తప్పనుంది. విద్యార్థులు అదనపు సమాధాన పత్రాలు ఇచ్చే విధానం వారు రాసిన సమాధాన పత్రాలు వరుస క్రమంలో దారంతో కట్టలేకపోతుండటంతో పాటు కొందరు అదనపు సమాధాన పత్రాన్ని దారంతో కట్టకుండా వదిలేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికే ఈ తాజా నిర్ణయం.
- Advertisement -