Wednesday, January 22, 2025

మెదడు లోని మార్పులు పార్కిన్‌సన్ వ్యాధికి సంకేతాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెదడు లో వచ్చిన మార్పుల బట్టి కొన్ని సంవత్సరాలకు ముందుగానే పార్కిన్‌సన్ వ్యాధి లక్షణాలను పసిగట్ట వచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. బ్రిటన్‌లో 1,40,000 మంది పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది నరాల వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. చలనంలో సమస్యలు వస్తాయి. గమనంలో నెమ్మది కావడం, శరీరం అంతా వణకడం, జ్ఞాపకశక్తి నశించడం వంటి అవలక్షణాలు కలుగుతాయి. ఈ లక్షణాలను నివారించడానికి సహాయపడే చికిత్సలు ఉన్నప్పటికీ, ఇంతవరకు ఈ వ్యాధిని పూర్తిగా నివారించే సరైన చికిత్స లేదనే చెప్పాలి. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు తాజా పరిశోధనల్లో కొన్నేళ్లకు ముందుగానే పార్కిన్‌సన్ వ్యాధి సంక్రమించే పరిస్థితిని ముందుగా తెలుసుకునే మార్గాలు ఉన్నట్టు వివరించారు. ఈ పరిశోధనలు వ్యాధిని కచ్చితంగా గుర్తించడం, వ్యాధి పెరగకుండా నిరోధించడం, మందుల అభివృద్ధి పరీక్షలు చేయడం వంటి వాటికి సహకరిస్తాయని చెప్పారు.

ఈ వ్యాధి రావడానికి కారణాలేమిటో తెలియడం లేదు. అందువల్ల వ్యాధిగ్రస్తులు ఈ లక్షణాలేమిటో ముందుగా తెలుసుకోలేక పోతున్నారు. జన్యుమార్పులపై కింగ్స్ కాలేజీ అధ్యయనం వ్యాధి ఎలా పెరుగుతుందో చెప్పగలుగుతుంది. అలాగే హెచ్చరికల సంకేతాలు చూపించింది. ఎవరిలోనైనా ఎస్‌ఎన్‌సిఎ జన్యువు ఉన్నట్టయితే దాదాపు పార్కిన్‌సన్ వ్యాధి తప్పకుండా సంక్రమిస్తుందని చెప్పవచ్చు. ఎస్‌ఎన్‌సిఎ జన్యువుతో కూడిన జన్యుమార్పుపెలోపొన్నేస్, గ్రీస్ గ్రామాల్లో కనిపిస్తుందని భావన. కానీ వ్యాధి కారకులు అరుదుగా ఉంటారు.

గ్రీస్ నుంచి బ్రిటన్‌కు జన్యు మార్పు అయిన పదిమంది వ్యక్తులను , అలాగే ఇటలీ నుంచి నలుగురిని ఎలా తీసుకువచ్చారో పరిశోధకులు వివరించారు. ఈ వ్యక్తులో సగానికి సగం మంది పార్కిన్‌సన్ వ్యాధికి సంబంధించిన భౌతిక లక్షణాలు కనిపించాయి. మిగతా ఏడుగురికి అలాంటి లక్షణాలు లేవు. పార్కిన్‌సన్ వ్యాధి గ్రస్తులైన 65 మంది స్కాన్లను విశ్లేషించారు. వ్యాధికి సంబంధించిన జన్యు మార్పులు ఏవీ వారిలో కనిపించలేదు. వ్యాధిగ్రస్తుల్లోని మెదడులో వ్యవస్థలు తారుమారు కావడం కనిపించింది. అది న్యూరోట్రాన్సిమిటర్ అంటే డొపమైన్ నడకలో మాంద్యం వంటి కొన్ని లక్షణాలకు కారణమవుతున్నట్టు తేలింది. మొత్తం మీద మెదడు లోని వ్యవస్థల్లో మార్పు రావడమవుతున్నట్టు స్పష్టమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News