Tuesday, November 5, 2024

టిబి రోగుల డైట్‌లో మార్పులు!

- Advertisement -
- Advertisement -

Changes in the diet of TB patients

వారంలో ఒక రోజు చికెన్‌ను చేర్చిన అధికారులు
ఇమ్యూనిటీ పెంచేందుకు కీలక నిర్ణయం
పైలట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లాలో సక్సెస్

హైదరాబాద్ : టిబి(క్షయ) రోగుల డైట్‌లో వైద్యశాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారంతో పాటు ప్రతి బుధవారం చికెన్‌తో భోజనం పెట్టాలని ఆరోగ్యశాఖ సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మంలో విజయవంతంగా కొనసాగుతున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు కూడా సహకరిస్తున్నట్లు టిబి అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ స్టార్ట్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇటీవల కేంద్రానికి ప్రపోజల్స్ కూడా పంపినట్లు టిబి విభాగంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో టిబి రోగుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి టిబి పేషెంట్లు వేగంగా కోలుకోవాలంటే మందులతో పాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతానికి ప్రతి రోజు రెండు ఎగ్స్‌తో కూడిన భోజనం అందిస్తుండగా, ప్రతి వారంలో బుధవారం గుడ్లకు బదులు చికెన్‌ను ఇవ్వనున్నారు. తద్వార ఇమ్యూనిటీ వేగంగా వృద్ధి చెందేందుకు వీలవుతోందని వైద్యులు తెలిపారు. దీంతో వ్యాధి నియంత్రించడం సులువుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న టిబి రోగుల డైట్‌కు ప్రభుత్వం రూ.58 లను కేటాయిస్తుంది. అయితే ఇక నుంచి ఆ ధరను మరింత పెంచే అవకాశం ఉంది. అంతేగాక క్షయ వ్యాధిగ్రస్తులకు బలమైన పోషకాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలకు బాధితులకు ఇస్తున్న రూ.500లనూ పెంచే ప్రపోజల్ ఉందని ఓ అధికారి అన్నారు.

టిబి కేసుల్లో హైదరాబాద్ టాప్

రాష్ట్ర వ్యాప్తంగా టిబి కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, అత్యల్పమైన కేసులు ములుగు జిల్లా లో రికార్డు అవుతున్నాయి. అయితే అతి వేగం గా ఖమ్మం జిల్లాల్లోని పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారని అధికారులు అంటున్నారు. అక్కడి సెంటర్‌లో తీసుకుంటున్న కేర్, ట్రీ ట్మెంట్, అవగాహనతోనే ఇది సాధ్యమవుతున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలో నమోదయ్యే టిబి కేసుల్లో అత్యధికం గా 89 శాతం పొగాకు వినియోగంతోనే వస్తున్నట్లు ఇటీవల వైద్యారోగ్యశాఖ తాజా సర్వేలో వెల్లడించారు. గతేడాది తెలంగాణలో 62,342 టిబి కేసులు తేలగా వీటిలో ఏకంగా 55వేలకు పైగా పొగాకు వాడకంతోనే వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. రెండు వారాల పాటు నిరంతరం దగ్గు, రాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం, శరీరం చెమటలు పట్టడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడటం, చెస్ట్ ఫెయిన్, మెడ, చంకల వద్ద గడ్డ లు ఉంటే స్థానిక టిబి స్క్రీనింగ్ సెంటర్లలో టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News