Monday, November 25, 2024

యుపిఐ లావాదేవీ నిబంధనలు, పరిమితుల్లో మార్పులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యుపిఐ) నేడు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అవసరంగా మారింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ డిజిటల్ పేమెంట్లను మెరుగుపర్చేందుకు 2024లో అనేక నిబంధనలు, మార్పులు రానున్నాయి. వాటిలో మొదటిది వినియోగించని యుపిఐ ఐడిలను నిలిపివేయడం, ఎన్‌పిసిఐ ఇప్పటికే ఈ దిశగా పేటీఎం, గూగుల్‌పే, ఫోన్, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రెండోది యుపిఐ లావాదేవీలకు రోజు వారీ పరిమితి రూ.1 లక్ష వరకు ఎన్‌పిసిఐ నిర్ణయించనుందని తెలుస్తోంది. ఆన్‌లైన్ పేమెంట్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్తవారికి తొలి పేమెంట్ రూ.2000 దాటితే 4 గంటల సమయం పరిమితి విధించడం, ఇది కూడా ఎన్‌పిసిఐ కీలక ప్రతిపాదనల్లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News