Monday, December 23, 2024

‘ఛాంగురే బంగారు రాజా’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

'Changure Bangaru Raja' movie Opening

మాస్ మహారాజా రవితేజ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్‌పై ‘ఛాంగురే బంగారురాజా’ అనే కొత్త చిత్రం రూపొందుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రత్నం, కుషిత కల్లపు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఛాంగురే బంగారు రాజా’ బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌నివ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, సుధీర్ బాబు దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుందర్ ఎన్. సి సినిమాటోగ్రాఫర్ . కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా చేస్తుండగా జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

‘Changure Bangaru Raja’ movie Opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News