Monday, December 23, 2024

‘ఛాంగురే బంగారురాజా’ టీజర్‌ లాంచ్ చేసిన రవితేజ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ యువ, ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ తో కంటెంట్-రిచ్ సినిమాలను తీయడానికి ఆర్టీ టీమ్‌వర్క్స్ ని స్థాపించారు. ఆర్ టీ టీమ్‌వర్క్స్ తాజా ప్రొడక్షన్ “ఛాంగురే బంగారురాజా” టీజర్‌ను ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న రవితేజ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యుసర్స్.

‘C/O కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ కథానాయిక. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. రవితేజ లాంచ్ చేసిన ఈ సినిమా టీజర్ లో మూడు పాత్రల చుట్టూ కథ ఆసక్తికరంగా తిరుగుతుంది.

సునీల్ వాయిస్ లో కుక్కను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఓ ప్రమాదంలో ముగ్గురిని కలిసిన తర్వాత తన జీవితం ఎలా తలకిందులైందో కుక్క వివరిస్తుంది. కార్తీక్, సత్య, రవిబాబు ముగ్గురు వేర్వేరు అమ్మాయిలను ప్రేమిస్తునట్లు కనిపించారు. కానీ వారిని హత్య కేసులో నిందితులుగా అరెస్టు చేస్తారు. హంతకుడు ఎవరు, వీరిలో ఒకరు లేదా బయటి వ్యక్తా ?

టీజర్ హిలేరియస్, గ్రిప్పింగ్ కథనంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సతీష్ వర్మ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్రెష్ క్రైమ్ జానర్‌ని ఎంచుకున్నాడు. కార్తీక్, సత్య, రవిబాబు త్రయం తమ పాత్రలను చక్కగా పోషించారు. సునీల్ వాయిస్‌ఓవర్ యాడ్-ఆన్.కృష్ణ సౌరభ్ సంగీతం అందించగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్. ఛాంగురే బంగారురాజా విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News