బెంగళూరు: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ కుమారుడు తన తల్లితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం హాజన జిల్లా చన్నరాయపట్టణ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భరత్(35) అనే యువకుడు తన తల్లి జయంతి(60) కలిసి ఉంటున్నాడు. భరత్‌కు గీతా అనే యువతితో పెళ్లి చేశారు. భరత్‌కు హెచ్‌ఐవి అనే వ్యాధి ఉందని, అది దాచి పెట్టి తనకు పెళ్లి చేశారని గీతా ఆరోపణలు చేసింది. దీంతో దంపతులు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు గొడవలు జరిగాయి. గీతా మద్యం తాగడంతో పాటు డ్రగ్స్‌కు బానిసగా మారడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని భరత్ ఆరోపణలు చేశాడు.
భరత్ ఔషధాలు వేసుకుంటుండగా గీతా ఫొటో తీసి తన తెలిసిన వైద్యుడికి పంపించింది. అవి హెచ్‌ఐవి ట్యాబ్లెట్లు అని వైద్యుడు ఆమెకు చెప్పాడు. భరత్‌కు వైద్య పరీక్షలు చేయాలని పెద్దమనుషులు ఓ ఒప్పందానికి రావడంతో పాటు ఒకతేదీని ఖరారు చేశారు. మార్చి 9న భరత్ తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లి బంగారు, ఆభరణాలు ఆమెకు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. మార్చి 10వ తేదీ తెల్లవారుజామున గ్రామ శివారులోని తన తల్లితో కలిసి కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గీతా పెట్టిన మానసిక వేధనతో భరత్, జయంతి ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ల బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.