చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణం స్వీకారం చేశారు. సోమవారం గవర్నర్, చరణ్‌జిత్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పంజాబ్ రాష్ట్ర తొలి దళిత సిఎంగా చరణ్‌జిత్ నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ తదితర నాయకులు హాజరయ్యారు. దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదివారం హుటాహుటిన నాయకత్వ ఖాళీ ప్రక్రియను ఆరంభించింది. ఆదివారం ఉదయం నుంచి సంబంధిత ప్రక్రియపై భారీ స్థాయిలో మంతనాలు జరిగాయి. తరువాత అనూహ్యరీతిలో చరణ్‌జిత్ ఎన్నిక జరిగింది. తొలుత సీనియర్ కాంగ్రెస్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా సిఎం అవుతారని ప్రచారం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి దళిత సిఎం అభ్యర్థితో ప్రచారంలోకి దిగుతుందనే వాదన తలెత్తింది. దీనిని పరిగణనలోకి తీసుకుని, అన్ని వర్గాలను ఒప్పించి చన్నీ పేరు ప్రతిపాదించినట్లు వెల్లడైంది. సిద్ధూకు సన్నిహితుడు అయిన సీనియర్ నేత బ్రహ్మ్ మెహీంద్రా కూడా చన్నీ ఎన్నికను బలపర్చారు.
Charanjit Singh takes oath as CM of Punjab