Monday, January 20, 2025

చార్‌ధామ్ యాత్ర … 12 రోజుల్లో 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Chardham Yatra 31 killed in 12 days

 

డెహ్రాడూన్ : ఈనెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీపీ, గుండెనొప్పి, మౌంటైన్ సిక్‌నెస్ వంటి వాటితో వీరు చనిపోయారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ మీడియాకు వెల్లడించారు. ఈ 31 మందిలో బద్రీనాధ్ స్థానికులు ఒకరు ఉన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యంగా ఉన్నవారినే తీర్థయాత్రలకు అనుమతించే విధంగా వైద్య పరీక్షలు ప్రారంభించింది. ఈమేరకు యాత్ర ప్రారంభ మార్గాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అనారోగ్యంగా తేలిన వారికి విశ్రాంతి తీసుకోవాలని, కోలుకున్న తరువాతనే ముందుకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ వీఐపీ దర్శనానికి ఈసారి ముగింపు పలికారు. ఇప్పటికే మూడు లక్షల మంది చార్ ధామ్‌ను సందర్శించినట్టు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News