Saturday, December 21, 2024

చార్ ధామ్ తీర్థయాత్ర ఆరంభం

- Advertisement -
- Advertisement -

భక్తుల కోసం కేదార్ నాథ్, యమునోత్రి పోర్టల్స్ తెరుచుకున్నాయి

డెహ్రాడూన్ : అక్షయ తృతీయ సందర్భంగా ఛార్ ధామ్ యాత్రను శుక్రవారం ఆరంభించారు. కేదార్ నాథ్, యమునోత్రి మందిరాల ధ్వారాలను భక్తుల కోసం తెరిచారు. శివుడికి, యమునోత్రి దేవతకు చెందిన మందిరాల ధ్వారాలు ఉదయం 7.00 గంటలకు తెరిచారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.

భక్తుల కోసం కేదార్ నాథ్ మందిరం పోర్టల్స్ ఓపెన్ చేసిన సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఆయన భార్య గీత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ‘‘మనం సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న ఈ శుభ రోజు(అక్షయ తృతీయ) నేడు. బాబా కేదార్ ఆశీస్సులు మీకు కలుగు గాక’’ అని అన్నారు. ఆయన దైవానికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మందిరం బయట భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేదార్ నాథ్ మందిరం పోర్టల్స్ ను తెరిచాక దాదాపు 10000 మంది భక్తులు చూశారు.

Kedarnath 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News