Wednesday, November 13, 2024

చార్‌థామ్ యాత్ర రెండు రోజులపాటు నిలిపివేత … 6 జిల్లాలకు రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ను మరోసారి భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడంతోపాటు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌లో చార్‌థామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ తీవ్రంగా ప్రభావితమౌతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 60 మంది మరణించగా, 17 మంది గల్లంతయ్యారు.

మరోవైపు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం పుష్కర్ సింగ్ థామి జిల్లా మెజిస్ట్రేట్‌లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యం లోనే ఆగస్టు 14,15 తేదీల్లో చార్‌థామ్ యాత్రను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. రుద్రప్రయాగ్, దేవ్ ప్రయాగ్, శ్రీనగర్‌లలో గంగా,మందాకిని , అలక్‌సంద నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులు మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News