Friday, November 15, 2024

రేపటి నుంచి 4 విత్‌డ్రాలు దాటితే చార్జీ

- Advertisement -
- Advertisement -

Charge if it exceeds 4 withdrawals from tomorrow:SBI

 

న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బిఎస్‌బిడి (బేసిస్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్) ఖాతాలకు ఒక నెలలో నాలుగు ఉచిత లావాదేవీలు ఉంటాయి. అది దాటితే, ఆ తర్వాత నగదు విత్‌డ్రాలపై ఎస్‌బిఐ చార్జీలు విధిస్తుంది. అలాగే కస్టమర్లు ఒక ఏడాదిలో 10 చెక్కుల కంటే ఎక్కువగా వినియోగిస్తే, చెక్ బుక్‌పై చార్జీ పడనుంది. జూలై 1 నుండి వచ్చే ఈ మార్పులను కస్టమర్లు దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే నెల 1 నుండి ఎటిఎంలో నగదు విత్‌డ్రా చేసే బిఎస్‌బిడి ఖాతాదారులు బ్యాంక్ ఎటిఎంలు, శాఖల్లో నాలుగు లావాదేవీలను మించితే, ఆ తర్వాత రూ.15 ప్లస్ జిఎస్‌టి చెల్లించాలి. ఎస్‌బిఐ ఎటిఎంలు కాకుండా ఇతర ఎటిఎంలలో నగదు ఉపసంహరించుకోవడానికి కూడా ఇదే చార్జీ వర్తిస్తుంది. అలాగే జూలై 1 నుండి బిఎస్‌బిడి ఖాతాదారుల నుండి చెక్‌ల వాడకాన్ని బ్యాంక్ పరిమితం చేయనుంది. 10 చెక్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఈ పరిమితికి మించి చెక్‌లు వాడితే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News