Friday, November 22, 2024

కర్నాటకలో రేవన్న, ప్రజ్వల్ పై అభియోగ పత్రం దాఖలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:  జనతాదళ్(సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) 2000 పేజీల సమగ్ర ఛార్జీ షీట్ ను దాఖలు చేసింది. అందులో లైంగిక వేధింపులకు ఎలా పాల్పడింది వివరించింది. 150 మంది సాక్షుల వాంగ్మూలాలను పొందుపరిచింది. బెంగళూరులోని స్పెషల్ పీపుల్స్ కోర్టులో ఈ ఛార్జీ షీటు సమర్పించింది. ప్రజ్వల్ రేవన్న మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మనుమడు. అతడు నలుగురు మహిళలను బలాత్కరించినట్లు, 70కి పైగా మహిళలను లైంగికంగా వేదించినట్లు, 2000 కు పైగా వీడియోలను అతడు రికార్డు చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే నలుగురు మహిళలు తమను ప్రజ్వల్ రేవన్న చెరిచినట్లు ఆరోపించారు. వారిలో ఒక మహిళ రేవన్న బంధువే. రేవన్న జర్మనీకి పారిపోయి మే 31న తిరిగొచ్చాడు.

ఇదిలావుండగా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న తండ్రి అయిన హెచ్ డి. రేవన్నపై కూడా సిట్ లైంగిక వేధింపుల ఛార్జీ షీట్ ను కోర్టులో సమర్పించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News