Wednesday, January 22, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

పలు కీలక అంశాలు వెల్లడి భుజంగరావు,
తిరుపతన్న బెయిల్‌పై నేడు తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫో న్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కే సులో పోలీసులు తాజాగా చార్జిషీటును దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో మార్చి 10న తొలిసారిగా ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు లో ఇప్పటికి నిందితులుగా ఉన్న నలుగురు పోలీసులను అరెస్టు చేయగా, నిందితులుగా మాత్రం ఆరుగురి పేర్లను చేర్చారు. అరెస్టు అయిన నలుగురిలో ఇప్పటి వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరు పతన్న, రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా రు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీ య దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాల ను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృ ష్టికి తెచ్చారు.

ఛార్జిషీట్ దాఖలు చేసినా కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉందన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు  చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటి షన్లపై వాదనలు పూర్తి అవడంతో ఈ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును బుధవారం వెల్లడించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్‌పి తిరుపతన్న కీలకంగా వ్యవహరించిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్‌lతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. మొత్తం 300మంది సెల్‌ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు.

ఈ క్రమంలో మూడు సిస్టమ్స్‌తో పాటు తొమ్మిది లాగర్స్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు, ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్‌లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి విదితమే. మరోవైపు పరారీలో ఉన్నట్లుగా చెప్పబడుతున్న వీరిద్దరికి పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని పేర్కొన్న పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన పోలీస్ అధికారుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆయనదేనని వెల్లడించిన సంగతి తెలిసిందే.

రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇలా అందరి వెనుక ఆయనే ఉన్నారంటూ పేర్కొనడంతోపాటు, ఎస్‌ఐబి కార్యాలయంలో ఆధారాలు, సాక్షాలను ధ్వంసం చేసి, మాయం చేశారని పోలీసులు కోర్టుకు స్పష్టం చేసిన సంగతి విదితమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల రాష్ట్ర భద్రతకు తీవ్ర విఘాతం కలిగిందని, వ్యక్తిగత భద్రత కూడా పోయింద న్నారు. ఆధారాలు, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వల్ల దశాబ్దాలు తరబడి సేకరించిన మావోయిస్టులు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News