Monday, December 23, 2024

పొరుగింటి విలన్లు ?

- Advertisement -
- Advertisement -

Charges against TV actress Vaishali neighbors in suicide incident

నటి వైశాలి ఆత్మహత్యలో మలుపు

ఇండోర్ : టీవీ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య ఘటనలో ఆమె పొరుగింటి వారిపై అభియోగాలు నమోదు చేశారు. ఇండోర్‌లో ఆమె నివాసంలో ఈ వర్థమాన నటి ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందారు. జవాబుల్లేని నైరాశ్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఆమె నివాసంలో దొరికిన సూసైడ్ నోట్ ప్రాతిపదికన ఆమె చనిపోవడానికి ప్రేరేపించారనే కారణం పేర్కొంటూ పొరుగిందటి వారిపై కేసులు పెట్టినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం విలేకరులకు తెలిపారు. టక్కర్ (29) ఆదివారం స్థానిక సాయిబాగ్ కాలనీలో ఉరేసుకుని చనిపోవడం తెరజీవితాలలో విషాదాన్ని తెలిపింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఇప్పటికైతే పొరుగు ఇంటి వారైన రాహుల్ నవ్లానీ, ఆయన భార్య దిషాపై ఐపిసి సెక్షన్ 306 పరిధిలో కేసు పెట్టినట్లు తదుపరి విచారణ జరిపిస్తున్నట్లు మిశ్రా విలేకరులకు తెలిపారు. వైశాలి వదిలిపెట్టిన 5 పేజీల సూసైడ్ నోట్‌లో రాహుల్ తనను వేధిస్తున్నట్లు తెలిపిందని ఇండోర్ పోలీసు అధికారి మోతీ ఉర్ రెహ్మన్ తెలిపారు. నటి పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసినప్పటి నుంచి పక్కనే ఉండే రాహుల్ ఆయన భార్య ఆమెను వేధిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. సూటిపోటీ మాటలతో ఇబ్బందిపెట్టారని నటి కుటుంబ సభ్యులు కూడా వాపొయ్యారు. నటి ఆత్మహత్య తరువాత పొరుగింటి వారు ఇంటికి లాక్ చేసుకుని వెళ్లారు. వారు ఎక్కడికి వెళ్లారనేది తెలియడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News