Saturday, December 28, 2024

బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాదారులకు పెనాల్టీ మోత

- Advertisement -
- Advertisement -

Charges on ATM transactions beyond the limit

కనీస మొత్తాన్ని ఖాతాల్లో ఉంచాలంటున్న బ్యాంకులు
పరిమితికి మించిన ఎటిఎం లావాదేవీలపైనా ఛార్జీలు
(పంజాబ్ నేషనల్ బ్యాంక్)

న్యూఢిల్లీ: సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఎఎంబి) ఉంచాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఒకవేళ ఖాతాదారులు సగటు మొత్తాన్ని ఖాతాలో ఉంచకపోతే పెనాల్టీ మోత తప్పదు. అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఎంతుండాలనేది ఒక్కో బ్యాంకుకు ఒకోవిధంగా ఉంది. ఖాతాదారులకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రాంతాన్నిబట్టి కూడా ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. అర్బన్, మెట్రో, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో ఉన్నబ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వేర్వేరుగా సగటు మొత్తం నిర్ణయించారు. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్స్ అందిస్తున్నా దేశంలోని ప్రముఖ బ్యాంకులన్నీ ఎఎంబి నిబంధనలు విధిస్తున్నాయి. భారత్‌లోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చిలో బేసిక్ సేవింగ్ ఖాతాదారులకు ఎఎంబి నిబంధనను రద్దు చేసింది. అయితే మంత్లీ యావరేజ్ బ్యాలన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాదారుకు నెలలో ఎన్నిసార్లయినా ఉచితంగా ఎటిఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. హెచ్‌డిఎఫ్‌సి సేవింగ్స్ ఖాతాదారులు తమ అర్బన్,మెట్రో లొకేషన్స్‌లో ఉన్నట్లయితే మంత్లీ సగటు మొత్తం రూ.10వేలుగా ఉంది.

సెమీ అర్బన్ లోకేషన్స్‌లో ఈ మొత్తం రూ.5వేలు ఉండగా, ఏరియాల్లో బ్యాలన్స్ రూ.2,500గా ఉంది. ఖాతాల్లో కనీస మొత్తం ఉంచడంలో విఫలమైతే బ్యాంకు రూ.150 నుంచి రూ.300 వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు మెట్రో, అర్బన్ ఏరియాల్లో రూ.10వేలు, సెమీ అర్బన్ ఏరియాల్లో రూ.5వేలు, రూరల్ ఏరియాలో ఉన్నవారు రూ.2వేలు మినిమమ్ మంత్లీ యావరేజ్ బ్యాలన్స్ ఉంటుంది. కనీస మొత్తాన్ని లేని అన్ని ప్రాంతాల్లో ఖాతాదారులకు ఐసీఐసీఐ రూ.500 పెనాల్టీ విధిస్తుంది. మరోవైపు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులన్నీ ఎటిఎంల నుంచి క్యాష్ విత్‌డ్రాలను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నాయి. ఉచిత లావాదేవీల తరువాత ఛార్జీల రూపంలో కొంతమొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. డెబిట్‌కార్డు రకాలనుబట్టి ఎన్నిసార్లు ఎటిఎం లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చనేది ఆయా బ్యాంకులు అనుమతిస్తున్నాయి. కాగా గతేడాది జూన్‌లో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిపికేషన్‌ప్రకారం పరిమిత సంఖ్యదాటి ఎటిఎం లావాదేవీలు నిర్వహించిన ప్రతిసారి రూ.21చొప్పున వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతించింది. 1జనవరి 2022 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News