Sunday, January 19, 2025

బ్రిజ్‌భూషణ్ పై అభియోగాలు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీ కోర్టు అధికారికంగా అభియోగాలు మోపింది. అయితే అతడు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు వెల్లడించారు. తాను నిర్దోషినని చెప్పారు. తాను విదేశాల్లో క్రీడాకారిణులతో ఒకే హోటల్‌లో బస చేయలేదని చెప్పారు. అతడి మాజీ కార్యదర్శి వినోద్ తోమర్ పైనా అభియోగాలు నమోదయ్యాయి. “ అవన్నీ తప్పుడు ఆరోపణలు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేనెవరినీ ఇంటికి పిలవలేదు. ఎవరినీ తిట్టలేదు. బెదిరించలేదు” అని తోమర్ వెల్లడించారు.

కోర్టులో వాదనల అనంతరం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి నాపై అభియోగాలు నమోదయ్యాయి. వాటిని వారు నిరూపించాల్సి ఉంది ” అని అన్నారు. రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే అరోపణలతో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశ్ పొగాట్, బజ్‌రంగ్ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు గత ఏడాది ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతణ్ణి డబ్లుఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీస్‌లు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో నేరపూరిత బెదిరింపు కింద అభియోగాలు నమోదయ్యాయి .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News