రైతు వినూత్న ప్రయోగం
మనతెలంగాణ/వెంకటాపూర్: పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పశు పక్షాదుల నుంచి కాపాడుకోవడానికి రోజుల తరబడి కాపలా కాస్తూ విసిగిపోతున్నారు. ఇలాంటి సమస్య అధిగమించడానికి మండల పరిధిలోని ఓ గ్రామంలో రైతు భిన్నంగా ఆలోచన చేసి తాను సాగు చేస్తున్న పంటలను కోతుల, పక్షుల భారీ నుండి కాపాడుకోవడానికి ఛార్జింగ్ మైకులో ఉష్షో..లగా..లగా..ఉష్షో..అంటూ అరుపులను రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన మైకును పంట మధ్యలో ఒక కర్ర పాతి దానికి మైకును కట్టి ఆన్ చేశారు. మైకు నుంచి ఆరుపులకు పక్షులు, కోతులు పటువైపు రావడం లేదు. కాగా చేనులో మనిషి లేకుండా అరుపులేక్కడి నుంచి వస్తున్నాయని అటుగా వెళ్ళే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అసలు విషయం తెలియడంతో రైతు ఆలోచనకు ప్రతి ఒక్కరు ముచ్చట పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషిలానే అరుస్తుండటంతో పక్షులు, కోతులు రావడం లేదని రైతు పేర్కొన్నారు.