Friday, January 3, 2025

ఓటిటిలోకి చారీ 111.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వెన్నెల‌ కిషోర్ తొలిసారి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం చారీ 111. స్పై కామెడీ ఎంటర్ టైనర్ గా టీజీ కీర్తికుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సిినిమా ప్రక్షకుల అంచనాలను అందుకోలేక నిరాశపర్చింది. దీంతో చాలా మందికి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో చారి 111.. ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ పామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 16 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల టాక్.

కాగా, హాలీవుడ్ సినిమా జానీ ఇంగ్లిష్ స్ఫూర్తితో నిర్మించి ఈ చిత్రంలో కిషోర్ సరసన సంయుక్త విశ్వ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. స‌త్య, తాగుబోతు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ తదితరులు కీల‌క పాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News