ఛండీగఢ్: మూడు నెలల నుంచి అదృశ్యమైన యోగా టీచర్ మృతదేహం ఓ గుంతలో కనిపించింది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం చరఖీ దాదరీ జిల్లాలో జరిగింది. రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేట్ వర్సిటీలో జగదీప్(45) అనే వ్యక్తి యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. రాజ్ కిరణ్ అనే వ్యక్తి భార్యతో జగదీప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. మూడు నెలల క్రితం యోగా టీచర్ జగదీప్ అదృశ్యం కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జగదీప్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రాజ్‌కిరణ్ పలుమార్లు అనుమానించాడు. డిసెంబర్ నెలలో జగదీప్‌ను రాజ్ కిరణ్ తన అనుచురులు ధరమ్ పాల్, హర్దీప్ లతో కలిసి కిడ్నాప్ చేశారు. ఆయన నోటికి టేపు అతికించి, కాళ్లు చేతులు కట్టేసి సజీవంగా గుంతలో పాతిపెట్టారు. దర్యాప్తులో భాగంగా రాజ్‌కిరణ్ అనుచరులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న రాజ్‌కిరణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
యోగా టీచర్ ను బతికుండగానే గుంతలో పాతి పెట్టారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -