Wednesday, January 22, 2025

చర్లలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఐఒఎస్ కమాండర్ రాజేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టిఎస్ గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్‌లో మావోయిస్టులు తారసపడడంతో లొంగిపోవాలని వారికి పోలీసులు సూచించారు. మావోలు కాల్పులు జరపడంతో గ్రేహౌండ్స్ దళాలు ఎదురు కాల్పులు జరిపారు.

Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాజస్థాన్ తో కీలక పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News